తాళ్లూరు మండలంలోని ఎరు వుల దుకాణం దారులు అనధికారికంగా ఎరువులు విక్రయించి, నిబంధనలు పాటించకుండా రైతులను మోసం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఏఓ ప్రసాదరావు హెచ్చరించారు. లక్కవరం రైతు మిత్ర ఏజెన్సీ షాపును శుక్రవారం తనిఖీ చేశారు. ఎరువు శాంపిల్స్ తీసు కొని నాణ్యతా ప్రమాణాల నిమిత్తం రీజినల్ కోడింగ్ సెంటర్ అమరావతికి పంపిస్తామని చెప్పారు. వీఏఏ నాగరాజు ఉన్నారు.

