యువత సేంద్రీయ వ్యవసాయ ప్రాముఖ్యతను తెలుసుకోవాలని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ అన్నపూర్ణ అన్నారు. ఆత్మ కార్యాలయం ఆవరణలో శుక్రవారం స్కిల్ ట్రైనింగ్ రూరల్ యూత్ (ఎస్టీఆర్ వై) కార్యక్రమం నాల్గవ రోజు నిర్వహించారు. ఆత్మ పీడీ అన్నపూర్ణ మాట్లాడుతూ వ్యవసాయం పంటలలో, ఉద్యాన వన పంటలలో, పశు పోషణలో సైతం సేంద్రీయ ఎరువులు వాడిన పంట, చెట్టు, గెదేల పరిస్థితి ప్రత్యేకంగా ఉంటుందని అన్నారు. జీవన ఎరువులు వాటిన వాటికి, రసాయన ఎరువుల వాటిన వాటికి బేధాలను వివరించారు. పశుసంవర్ధక శాఖ డిడిఏ సోమయ్య, దర్శి హెన్ఆర్ఎస్ హెడ్ ధనుంజయ రావు, జీవ శాఖ ఎఓ గోపిచంద్, ఎన్ఎస్ఎఫ్ మహేష్, డిఆర్సీ ఎఓలు శైలజరాణి, శేషమ్మలు పలు విభాగాలలో సేంద్రీయ ఎరువుల ప్రాముఖ్యత, పని చేయు విధానంలను వివరించారు.

