ప్రకాశం జిల్లా దర్శిలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప పడి పూజ కార్యక్రమం భక్తి శ్రర్థలతో ఘనంగా నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప … మాల ధారణం నియమాల తోరణం.. అంటూ అయ్యప్ప పడి పూజ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జిల్లాలో పలు ప్రాంతాలతో పాటు, నియోజక వర్గంలోని అయ్యప్ప మాల ధారులు పూజల్లో పాల్గొన్నారు. అయ్యప్పస్వామికి అరటి బోదేలతో మండలం, 18 మెట్లు, రంగు రంగు విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రధాన స్వాములు పాల్గొని ప్రత్యేక పూజ, భజన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, కుటుంబసభ్యులు అయ్యప్ప పాటలు ఉత్సాహంగా పాడారు. అనంతరం అధిక సంఖ్యలో పాల్గొన్న స్వాములకు భిక్ష దానం చేసారు.





