దర్శిలో ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేసిన బిజేపి శ్రేణులు – పలు చోట్ల స్వీట్లు పంపిణీ

నాలుగు రాష్ట్రాలలో ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాలలో మంచి ఫలితాలు సాధించినందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు, జిల్లా ఉపాధ్యక్షుడు తిండి నారాయణ రెడ్డి, దర్శి అసెంబ్లీ కన్వినర్ మాడపాకులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు. గడియారం స్తంభం సెంటర్లో బాణ సంచా పెల్చి పలు చోట్ల స్వీట్లు పంపిణీ చేసారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ ల లో విజయం, తెలంగాణ ఎన్నికలలో మంచి ఓటింగ్ శాతం సంపాదించటంపై హర్షం వ్యక్తం చేసారు. స్వీట్లు పంపిణీ చేసారు. జిల్లా లీగల్ సెల్ కో కన్వీనర్ పత్తి బసమేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు అచ్యుత గురువార్జున రావు, రూరల్ అధ్యక్షుడు కాకర్ల సాయి, ముండ్లమూరు మండల ప్రధాన కార్యదర్శి దేసు రాజా ప్రతాప్, పట్టణ ప్రధాన కార్యదర్శి చల్లా వెలుగొండయ్య, పట్టణ ఉపాధ్యక్షుడు అచ్యుత్ శరత్ బాబు, పట్టణ ఉపాధ్యక్షుడు ఆవుల రామ లింగా రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసులు, మైనార్టీ మోర్చా నాయకులు మసూద్, పట్టణ ఉపాధ్యక్షుడు బస్సు నరసింహారావు, జిల్లా యువజన మోర్చ ఉపాధ్యక్షుడు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *