సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అభినందన ల వెల్లువ కొనసాగుతోంది.
ఆంగ్ల నూతన సంవత్సరం సందర్బంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, BRS పార్టీ నాయకులు మంగళ వారం మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో కలిసి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేశారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో మత్స్యశాఖ ఉన్నతాధికారులు మురళీకృష్ణ, మహిపాల్, జీ హెచ్ ఎం సీ ఈ ఈ సుదర్శన్, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అద్యక్షుడు మేకల రాములు యాదవ్, సభ్యులు గుడిగే శ్రీనివాస్ యాదవ్, బేగంపేట కార్పొరేటర్ టి.మహేశ్వరి, డివిజన్ అద్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, శేఖర్, ఆరీఫ్, మోహిన్, SR నగర్ కు చెందిన సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ అద్యక్షుడు మాణిక్ రావ్ పాటిల్, సహదేవ్ గౌడ్, మాధవరావు, మాణిక్ రావ్, అరవింద్, బిచ్చప్ప, అనంతరెడ్డి, ఎస్సార్ నగర్ లోని బి టైప్ క్వార్టర్స్ అసోసియేషన్ కు చెందిన గౌతమ్, రాజేష్, రమణ, సుధాకర్ రెడ్డి, బాపూనగర్ కు చెందిన బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు లలితా చౌహాన్, హరిసింగ్, గోపిలాల్ చౌహాన్, గులాబ్ సింగ్ రాజ్ పురోహిత్, పద్మారావు నగర్ కు చెందిన బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు పుష్యంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.





