ఉద్యాన పంటల రైతులు పంటలను కాపాడుకోవాలి జిల్లా ఉద్యానవన శాఖాధికారి వై గోపిచంద్

మిచాంగ్ తుఫాన్ నేపధ్యంలో ఉద్యాన వన పంటలు సాగు చేయు రైతులు తగు జాగ్రత్తలు తీసుకుని పంటలను కాపాడుకోవాలని జిల్లా ఉద్యానవన శాఖాధికారి వై గోపిచంద్ కోరారు. ముఖ్యంగా మన జిల్లాలో కూరగాయలు, వంగ, మిరప, అరటి, బొబ్బాయి, నిమ్మ, బత్తాయి పంటలు సాగు చేయు రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఆయా పంటల సాగు చేయు రైతులకు పలు సూచనలు చేసారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కూరగాయలు (మిరప, టమాట, వంగ): సాగు చేయు రైతులు పొలంలో నిలిచిన నీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు పంపివెయ్యాలని కోరారు. వర్షాలు ఆగిన వెంటనే 19: 19: 19 లేదా 13:0:45 లేదా యూరియా వంటి పోషకాలు పంటలపై పిచికారి చెయ్యాలని చెప్పారు. వర్షాలు ఆగిన వెంటనే అంతర సేద్యం చేసే కలుపును తొలగించటమే కాకుండా నేల త్వరగా ఆరేటట్లు చేసుకోవాలని చెప్పారు. పొలంలో నీరు నిలవటం వలన ఎండు తెగులు ఆశించే అవకాశం ఉన్నందున నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా. లీటర్ నీటికి లేదా మెటలాక్సిల్ మరియు మాంకోజెబ్ 2.గ్రా. లీటరు కలిపి మొక్కల పొదల్లో పొయ్యాలని చెప్పారు. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గటం వలన ఆకుమచ్చ తెగులు, బూజు తెగుల ఆశించే అవకాశం ఉన్నందున నివారణకు కార్బెండిజం 1 గ్రా లీటరు నీటికి కలిపి లేదా మాంకోజెబ్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చెయ్యాలని చెప్పారు. బూజు నివారణకు డైమిధోమర్ఫ్ 1.5 గ్రాముల లేదా మెటలాక్సిల్ మాంకోజెబ్ 2.0 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చెయ్యాలని చెప్పారు. బ్యాక్టీరియా ఆకుమచ్చ కానోఫారా వంటి తెగుళ్ల ఆశించే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా 10లీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ మరియు 1 గ్రా స్ట్రెప్టోసైక్లిన్ కలిపిన ద్రావణం పిచికారి చేసి వీటి వ్వాప్తి ఆరికట్టాలని కోరారు.
అరటి: గాలిలో అధిక తేమ వలన సిగటోకా ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది కావున నివారణకు ప్రొఫికొనజోల్ 1.0 మి.లీ లీటరు నీటికి కలిపి జిగురుతో పాటు పిచికారి చెయ్యాలని కోరారు. భూమిలో అధిక తేమ వలన అరటి దుంపలు కుళ్లి పోకుండా నివారించటానికి ఆక్సీ క్లోరైడ్ 3.0 గ్రా. లేదా 1శాతం బోర్డో మిశ్రమం దుంప చుట్టూ తడిచే విధంగా పోయాలి.

బొప్పాయి: అధిక వర్షాల వలన మొక్కలు పసుపురంగులోని మారడం మరియు కాండము కుళ్లు వంటి లక్షణాలు ఉన్నట్లయితే రిడోమిల్ 2.0గ్రా లీటరు నీటికి కలిపి లేదా ఎలైట్ 2.0 గ్రాముల లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లలో పోయాలి.

అధిక వర్షపాతం తర్వాత పండు ఈగ ఉదృతి అధిక మయ్యే అవకాశం ఉంది కనుక మిథైల్ యూజినాల్ ఎరలను ఎకరాకు 10-15 ఏర్పాటు చేయ్యాలని చెప్పారు.

నిమ్మ, బత్తాయి:

అధిక వర్షాల వలన ముంపుకు గురి అయిన తోటల్లో బంక తెగులు వ్యాప్తిని నివారించటానికి 1శాతం బోర్డో మిశ్రమం లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3. గ్రాములు ఒక లీటరు నీటికి కలిపిన ద్రావణం కొమ్మలు తడిచేటట్లు పిచికారి చెయ్యాలని కోరారు.

వర్షాల తర్వాత బొబ్బర తెగులు మరియు బ్యాక్లిరియా తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉన్నందున తెగులు వ్వాప్తి తగ్గించటానికి 30 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ మరియు 1 గ్రాము స్ట్రెప్టో సైక్లిన్ 10 లీటర్ల నీటికి కలిపి 15-20 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చెయ్యాలని చెప్పారు.
పూల తోటలు : పొలంలో నీరు నిలువలేకుండా చెయ్యాలని చామంతి, బంతి తోటలో అధిక
వర్షాలతో తేమ కారణంగా తెగుళ్ల ఉదృతి పెరుగుతుందని వీని నివారణకు ప్యూజెరియం
వడలు తెగులు నివారణకు కార్బండజిమ్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లలో
పోయ్యాలని చెప్పారు. తుప్పు తెగులు నివారణకు సల్పర్ 0.2శాతం డస్ట్ చెయ్యాలని,
ఆకుమచ్చ తెగులు నివారణకు కార్బండజిమ్ 1 గ్రాము లీటరు నీటిని కలిపి పిచికారి
చెయ్యాలని . మొదలు కుళ్లు తెగులు నివారణకు సల్పర్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి
పిచికారి చెయ్యాలని చెప్పారు. పువ్వు, మొగ్గ కుళ్లు నివారణకు డైథేన్ యం 45 రెండు
గ్రామెల లీటరు నీటికి కలిపి పిచికారి చెయ్యాలని కోరారు. మొక్కల మొదళ్లు ఎగదోసి
కర్రలు పాతి ఊతమివ్వాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *