భూసార యాజమాన్య చర్యలతో నేల ఆరోగ్యం- తాళ్లూరు లో ప్రపంచ నేల ఆరోగ్య దినోత్సవం నిర్వహణ

భూసార యాజమాన్య చర్యలద్వారా పంటల భూముల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు అని వక్తలు తెలిపారు.
తాళ్లూరులో ఎంపీడీవో కార్యాలయం వద్ద సోమవారం ప్రపంచ నేల ఆరోగ్య దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఎంపీడీవో కే యుగ కీర్తి, తహసీల్దార్ కె. వి ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి బి ప్రసాదరావులు మాట్లాడుతూ… కంపోస్ట్ ఎరువులు, గోబర్ గ్యాస్, గొర్రె, మేక, తదితర జంతువుల వ్యర్ధాలు, కంపోస్ట్ ఎరువులు, చెరువు మట్టి, ఘనజీవామృతం, జీవామృతం, చెట్ల ఆకులు, కోళ్ల వ్యర్ధాలు, తదితర వాటివల్ల నేలలోని పోషక విలువలను తిరిగి ఏర్పరుచుకోవచ్చని వారు తెలి పారు. గతంలో భూములలో ఐదు శాతం కర్బన నిలువలు ఉండేవని అవి నేడు 0.5 శాతానికి తగ్గాయని కర్బన పదార్థాలను అభివృద్ధి చేసుకున్నట్లయితే పోషక విలువలు అభివృద్ధి చెందుతాయని వారు తెలిపారు. పొలాల్లో పండిం చిన పంటల కట్టెలను తగులు పెట్టకుండా భూమిలో కలియ దున్నాలని వారు సూచించారు. ఎంఈఓ జి సుబ్బయ్య, సర్పంచులు షేక్ కాలేశావలి, పి సుమలత శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీలు, ఏపీఎం దేవరాజు, ఏఈఓ నాగరాజు, వి ఏఏ నాగరాజు నాయక్ వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *