అన్నింటికీ మీకు నేను ఉన్నానని, ప్రభుత్వంలో లేమని అదైర్య పడాల్సిన పని లేదని సనత్ నగర్ నుండి మూడోసారి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన MLA, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ లు, వివిధ ప్రాంతాలకు చెందిన BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను కలిసి పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఎవరికీ ఏ అవసరమొచ్చిన మొదటి నుండి తాను అండగా నిలిచానని, ఇక ముందు కూడా ఉంటాననే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ రవీందర్ యాదవ్, బేగంపేట కార్పొరేటర్ టి.మహేశ్వరి, డివిజన్ అద్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, శేఖర్, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, కిరణ్మయికిషోర్, అమీర్ పేట మర్చంట్స్ అసోసియేషన్ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ సింగ్ రాజ్ పురోహిత్, చరణ్ సింగ్, గ్రీన్ సిటీ MD. సుబ్బరాజు, రమేష్ గౌడ్, మీడియా ప్రతినిధులు, పద్మారావు నగర్ కు చెందిన BRS నాయకులు శ్రీకాంత్ రెడ్డి, ఏసూరి సావిత్రి మహేష్, సురేష్, ముక్కా శ్రీనివాస్, శ్రీరాం నగర్ కాలనీ, గంగుబాయ్ బస్తీ, అంకమ్మ బస్తీ, బ్రాహ్మణవాడి, జెక్ కాలనీ తదితర కాలనీలకు చెందిన ప్రతినిధులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఘన విజయం సాధించడం పట్ల శుభాభినందనలు తెలిపారు.





