తాళ్లూరు మండలంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి – ఆరోగ్య, ఆశ కార్యకర్తల సమావేశం నిర్వహణ

జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని తాళ్లూరు పీహెచ్ సి వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తాన్ బి కోరారు. పీహెచ్సీ లో మంగళవారం ఆరోగ్య, ఆశ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం -1లో ప్రతి ఒక్కరూ చక్కగా పనిచేసారని, అదేవిధంగా జగనన్న సురక్ష -2 విజయవంతం చేసి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని అన్నారు. అందుకు సంబంధించిన పలు సూచనలు చేసారు. ఆయా గ్రామాలలో జరుగు తేదీలను తెలిపారు. డీపీఎంఓ సుబ్బారెడ్డి మాట్లాడుతూ లెప్రసీ కేసుల గుర్తింపు విషయంలో తగిన సూచనలు చేసారు. అనంతరం సీనియర్ సిటిజన్ కంచర్ల పిచ్చమ్మ కుటుంబసభ్యులు పీహెచ్సీ సేవలను అభినందిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 56 మంది వైద్య విభాగపు సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేసారు. గత నాలుగు సంవత్సరాలుగా వైద్య సిబ్బందికి స్వీట్స్ అందిస్తున్నామని పిచ్చమ్మ కుమారుడు ఏ బి సి హై స్కూల్ డైరెక్టర్ కంచర్ల కాలేషా బాబు తెలిపారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు డాక్టర్ రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *