ప్రకృతి వ్యవసాయ గుర్తింపు సర్టిఫికేట్తో రైతులకు మరింత ఉపయోగకరమని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మెనేజర్ సుభాషిణి అన్నారు. ఒంగోలు రైతు సాధికార సంస్థ ఎపీ కమ్యునిటి నేచురల్ ఫార్మింగ్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ దారులకు పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఆఫ్ ఇండియా (పీజీఎస్) సర్టిఫికేట్పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్గానిక్ ఇండియా, గ్రీన్ ఇండియా సర్టిఫికేట్స్ పొందిన రైతులు తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు సైతం తమ ప్రకృతి ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం తమ ఉత్పత్తులకు ఉండే డిమాండ్ గురించి తెలిపారు. అందుకు రూపొందించిన ప్రత్యేక యాప్ గురించి తెలిపారు. ప్రకృతి వ్యవసాయ రాష్ట్ర ఆర్పీలు వెంకటరావు, సత్య సాయి, రాజేష్, సత్యనారాయణ, ఎన్ఎస్ఏ, ఎంటీ, యూనిట్ ఇన్చార్జిలు పాల్గొన్నారు.
