పంటను ట్రాక్ట ర్ తో తొక్కించి ధ్వంసం చేసిన మల్లయ్యపై కేసు నమోదుకు డిమాండ్

చింతల పాలెంలో పేదలు సాగు చేసుకుం టున్న భూముల్లోని పంటను ట్రాక్ట ర్ తో తొక్కించి ధ్వంసం చేసిన అదే గ్రామానికి చెందిన ఎడ్ల మల్లయ్య ను అరెస్టు చేయాలని పలువురు దళిత, గిరిజనులు డిమాండ్ చేశారు. జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దారా అంజయ్య ఆధ్వర్యాన వారికి జరిగిన అన్యాయం గురించి పేదలు మంగళవారం పోలీసు స్టేషన్ కు వచ్చి విజయ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. చింతలపాలెంలో ప్రభుత్వానికి చెందిన సుమారు 70 ఎకరాల ఉమ్మడి గడ్డ భూములను దళిత, గిరిజనులు సాగు చేస్తుండగా 2021లో కొందరు రైతులు దాడులు చేయడంతో కేసులు నమోదు చేశారని, ఆకేసులు కోర్టులో విచారణలో ఉండడం, భూములు పేదలే సాగు చేయడం జరుగు తుందన్నారు. అయితే ఇటీవల ఎడ్ల మల్లయ్య కన్ను ఆ భూములపై పడిందని, దక్కించుకునేందుకు వీఆర్వో సహకారంతో ప్రయత్నాలు చేసినా సాధ్యం కాక పోవడంతో ఇటీవల సాగుచేసిన పంటను ట్రాక్టరుతో తొక్కించి ధ్వంసం చేశారని ఎస్సైకి ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు చేపడతామని ఎస్సై వారికి హామీ ఇచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *