వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటన -ట్రాక్టర్ పై వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ బాధితులకు మంత్రి భరోసా -ఆటోలో వెళ్లి గండిపడిన బుడమేరు కాలువను పరిశీలించిన మంత్రి

వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉందని ఏ ఒక్కరు అధైర్యపడవద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. బుధవారం నాడు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలు జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీల్లో మంత్రి పర్యటించారు. ట్రాక్టర్ పై వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ, బాధితులకు ఆహారం, నీళ్లు, పాలు అందుతున్నాయా లేదాఅని అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపించి.. ఓ అపార్ట్మెంట్లో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులను మంత్రి రక్షించారు. ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా చూడాలని, ఏ ఒక్కరి నుంచి ఆహారం అంద లేదనే పిర్యాదు రాకూడదని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, కొలికపూడి శ్రీనివాసులతో కలిసి గండి పడిన బుడమేరు కాలువను పరిశీలించారు. కారు వెళ్లేందుకు వీలుగా లేకపోవడంతో మంత్రి ఆటోలో వెళ్లి కాలువను పరిశీలించారు.అధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాధిపదికన పనులు పూర్తి చేయాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *