విగ్రహా కమిటి ఏర్పాట్లను పరిశీలించి తగిన సూచనలు చేసిన పోలీసులు
వినాయక చవితి పండుగ వేడుకలను తాళ్లూరు మండలంలో భక్తి శ్రర్థలతో సోమవారం మూడవ రోజు నిర్వహించారు. మండలంలో అధిక సంఖ్యలో విగ్రహా కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా గణనాథుని విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా విగ్రహాల వద్ద శాస్త్రయుక్తంగా మూడవ రోజు వేడుకలు కొనసాగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తాళ్లూరు ఎస్సై మల్లిఖార్జున రావు పలు గ్రామాలలో విగ్రహాలను సందర్శించి ప్రత్యేక సూచనలు చేసారు. జై బోలో గణేష్ మహారాజ్ కు అంటూ ఆయా భక్తుల నినాదాలతో ఆయా విగ్రహాల వద్ద ప్రత్యేక భజనలు, పూజలతో మార్మోగుతున్నాయి. పలు చోట్ల విగ్రహా కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొర్రపాటి వారి పాలెంలో యాదవ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో విద్యార్థులు బుల్లి గణ పతిని ఏర్పాటు చేసి పెద్దల సహాకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
