జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలి – జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా

జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ హాలులో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (DCC), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (DLRC) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలురకాల ఋణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 2024 మార్చి 31వ తేదీ నాటికి జిల్లా క్రెడిట్ ప్లాన్ లక్ష్యం రూ.17,988 కోట్లకు గాను.. రూ.30,975.15 కోట్ల రుణాలు మంజూరు చేసి 172.19 శాతం ఆర్థిక ప్రగతిని సాధించడం జరిగిందన్నారు. అలాగే… 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా క్రెడిట్ ప్లాన్ లక్ష్యం రూ.20,591.18 కోట్ల గా నిర్ణయించగా, ఈ ఆర్ధిక సంవత్సరంలో పంట రుణాలకు సంబంధించి ఖరీప్ లో రూ.3900.40 కోట్ల లక్ష్యానికి గాను, 2024 జూన్ 30వ తేదీ నాటికి రూ.2,368.97 కోట్ల రుణాలను అందజేసి 60.73 శాతం ఆర్థిక ప్రగతిని సాధించడం జరిగిందన్నారు. అలాగే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో 32,657 స్వయం సహాయక సంఘాలకు 1671.03 కోట్ల రూపాయాల రుణాలు మంజూరు లక్ష్యం కాగా, 2024 జూన్ 30వ తేదీ నాటికి 7982 స్వయం సహాయక సంఘాలకు 616.19 కోట్ల రూపాయాల రుణాలు మంజూరు చేసి 24.44 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు. అలాగే మెప్మా ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో 1485 స్వయం సహాయక సంఘాలకు 5940 కోట్ల రూపాయాల రుణాలు మంజూరు లక్ష్యం కాగా, 2024 జూన్ 30వ తేదీ నాటికి 430 స్వయం సహాయక సంఘాలకు 5555.65 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అందుకు సంబంధించి అర్హత పొందిన లబ్దిదారులకు పెండింగ్ లేకుండా రుణాలు అందించాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, బ్యాంకు అధికారులకు సూచించారు. ప్రతి గ్రామంలో రైతులు, మహిళా సంఘాలు, విద్యార్థులకు బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలను తరచూ నిర్వహించాలన్నారు. సీసీ ఆర్ సి కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఏడాది రుణం అందించాలని తెలిపారు. సీసీఆర్సి కార్డులు ఉన్న రైతులంతా అర్హులేనని, వారి పై ఎలాంటి అనుమానాలకు తావు లేదని వారికి పంట రుణాలు, పశు రుణాలను అందజేసి ప్రోత్సహించాలని బ్యాంకర్లను కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, లీడ్ జిల్లా మేనేజర్ రమేష్, డిఆర్డిఎ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు వసుంధర, రవి కుమార్, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్లు శ్రీనివాసులు, డా. బేబి రాణి, జనార్ధన్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి గోపి చంద్, హౌసింగ్ పిడి శ్రీనివాస ప్రసాద్, ఎపిఏంఐపి పిడి రమణ, డిటిడబ్ల్యూఓ శ్రీ జగన్నాధ రావు, చేనేత, జౌళి శాఖ ఎడి శ్రీ ఉదయ కుమార్ అన్ని జిల్లా బ్యాంకు కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *