ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ క్రీమిలే యర్ తీర్పుపై ఈ నెల 22న హలో మాల ఛలో ఒంగోలు బహిరంగ సభను జయప్రదం చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య పిలుపునిచ్చారు. స్థానిక కమ్యూనిటీ భవనం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు వ్యతిరేకమని భావిస్తున్నామని, మాల మహాసభ జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు రివ్యూ దాఖలు చేసిన నేపథ్యంలో విస్త్రత చర్చ జరుగుతున్నదన్నారు. ఒంగోలులో జరిగే సభలో సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడం జరుగును కావున పెద్ద ఎత్తున మాలలు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.
