ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం పై ప్రత్యేక దృష్టి – ఈ రంగం అభివృద్దికి ప్రత్యేక చర్యలు – జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ. తమీమ్ అన్సారియా

ప్రపంచ వ్యాప్తంగా అన్నీ దేశాలు పర్యాటక రంగం పై ప్రత్యేక దృష్టి సారించడంతో, ఈ రంగం అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని, నేడు పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా కలుగుచున్నవని, విద్యార్ధులు ఈ రంగానికి సంబంధించిన నైపుణ్యాన్ని విద్యార్ధి దశ నుండే పెంపొందించుకోవాల్సిన అవసరం వుందని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా విద్యార్ధులకు సూచించారు.
ఒంగోలు ఆంధ్ర కేసరి విద్యా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొని, జ్యోతి ప్రజాల్వన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యాటక రంగం ప్రాధాన్యతను దృష్టిలో వుంచుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. పర్యాటక దినోత్సవాన్ని విద్యార్ధుల మద్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా వుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్నీ దేశాలు పర్యాటక రంగం పై ప్రత్యేక దృష్టి సారించడం తో, ఈ రంగం అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు కలుగుచున్నవని, విద్యార్ధులు ఈ రంగానికి సంబంధించిన నైపుణ్యాన్ని విద్యార్ధి దశ నుండే పెంపొందించుకోవాల్సిన అవసరం వుందన్నారు. ప్రతి విద్యార్ది తను వున్న ప్రదేశంలో, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో ఏ ఏ పర్యాటక ప్రదేశాలు వున్నాయి,వాటి విశిష్టత ఏమిటి అనేది తెలుసుకోవడంతో పాటు ఆ ప్రదేశాలకు వెళ్ళి చూడాలన్నారు. పర్యాటక ప్రదేశాల్లో పర్యటించు సంధర్భంలో ఆ ప్రాంత విశేషాలు, భాషా, ఆ ప్రాంత సంస్కృతి వంటి ఎన్నో విషయాలు తెలుకోవడం జరుగుతుందని, తద్వారా వారిలో కమ్యూనికేషన్ స్కిల్ పెంపొందదానికి అవకాశం వుంటుందని కలెక్టర్ వివరించారు. ప్రతి విద్యార్ధి ప్రతి రోజు న్యూస్ పేపర్ ను చదివేలా అలవాటు చేసుకోవాలని, దానివలన సమాజంలో జరుగుచున్న విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధులకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ఆమలు చేస్తున్నదని, విద్యార్దులు వాటిని సద్వినియోగం చేసుకొని జీవితంలో నిర్ధేసించుకున్న లక్ష్యాలను సాధించుకోవాలని ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్ధులకు సూచించారు. జిల్లాలో కొత్తపట్నం, పాకల బీచ్ లు ప్రాచుర్యం పొందాయని, బైరవకొన, గుండ్ల బ్రహ్మేశ్వరం, నల్లమల తుమ్మల బయలు ముఖ్యమైన ఎకో పర్యాటక ప్రదేశాలు, గుండ్లకమ్మ,రామతీర్ధ రిజర్వాయర్లు, సింగరాయకొండ, త్రిపురాంతకం, మార్కాపురం దేవాలయాలు మతపరమైన పర్యాటక ప్రదేశాలు వున్నాయని, ఈ పర్యాటక ప్రదేశాలను మరింతగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లా పర్యాటక శాఖాధికారి బెన్హర్ మాట్లాడుతూ, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్నీ దేశాలు పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుచున్నదన్నారు. వ్యవసాయ రంగం తరువాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం పర్యాటక రంగమన్నారు. పర్యాటకం మరియు శాంతి అనే థీమ్ తో 2024 ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో చారిత్రిక దేవాలయాలు, స్మారక చిహ్నాలు, బీచ్ లు, రిజర్వాయర్లు మరియు పర్యావరణ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వీటిని పర్యాటక ప్రదేశాలుగా మరింతగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్.ఐ.ఓ సైమన్ విక్టర్, జిల్లా యూత్ కో ఆర్డినేటర్ కమల్ సా, స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ, ఆంధ్ర కేసరి విద్యా కేంద్రం ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తదితరులు మాట్లాడుతూ, పర్యాటక రంగ ప్రాధాన్యతను, అవసరాలను వివరించారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, ఆంధ్ర కేసరి విద్యా కేంద్రం విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *