వృత్తి విద్యాకోర్సులతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని యూనియన్ బ్యాంకు మెనేజర్ జాన్ పీటర్ అన్నారు. తూర్పుగంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులకు పీఎంశ్రీ స్కూల్స్ వృత్తి విద్యలో బాగంగా ఇంటర్న్ షిప్ పొగ్రాం ఏర్పాటు చేసారు. బ్యాంక్ మెనేజర్ జాన్ పీటర్ విద్యార్థులకు బ్యాకింగ్ రంగంలో జరిగే రోజు వారి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం పొందటానికి అవసరమైన నాలెడ్జ్, నైపుణ్యాలను వివరించారు. హెల్త్ కేర్ ట్రేడ్ కి సంబంధించి డాక్టర్ ఆల్ ఫ్రెడ్ విద్యార్థులకు వివరించారు. బ్యాంకింగ్ ట్రేడ్ లో 30 మంది, హెల్త్ కేర్లో 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వృత్తి విద్య ఉపాధ్యాయులు యరగొర్ల అంజి బాబు, చలగుండ్ల డేవిడ్ లు పాల్గొన్నారు.
