రైతుల సమిష్టి బాగస్వామ్యంతో చేపట్టే పనుల వలన మంచి ఫలితాలు వస్తాయని దర్శి డివిజన్ సహాయ సంచాలకులు కె బాలాజీ నాయక్ అన్నారు. మండలంలో దారం వారి పాలెం, మన్నేపల్లి, తురకపాలెం గ్రామాలలో జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఎడీఏ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొక్కజొన్న పొలాలను పరిశీలించి అందులో అశించిన కత్తెర పురుగు నివారణ చర్యలను సూచించారు. ప్రకృతి సాగు ఇన్చార్జి పి నరసింహాం కషాయం తయారీ, నీమ్ సీడ్ కెర్నల్ ద్రావణం తయారీ గురించి వివరించారు. పంట జీవిత దశలు చీడ పీడలు పోషకాల నిఘాపై అవగాహన మరియు నేషనల్ ఫెస్టీ సర్వీసెన్స్ సిస్టమ్ యాప్ గురించి వివరించారు. విఏఏలు నవీన్, భార్గవి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

