నిమ్మ, బత్తాయి తోటల పునరుద్ధరణకు రైతులు అవగాహనతో ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయని ఉధ్యాన వన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం రవీంద్ర బాబు అన్నారు. నాగంబొట్ల పాలెంలో ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో నిమ్మ, బత్తాయి తోటల పునరుద్ధరణపై రైతులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం రవీంద్ర బాబు మాట్లాడుతూ బత్తాయిలో వేరుకుళ్లు తెగుళ్లు నివారణ, ఎండు కొమ్మలు కత్తిరించి విధానం ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తే కలిగే ప్రయోజనాలు వాడాల్సిన ఎరువుల గురించి వివరించారు. ఉద్యానవన శాఖాధికారి రవి బాబు మాట్లాడుతూ బత్తాయి తోటల్లో కాపు కోతల అనంతరం ఎండు పుల్లలను తొలగించు విధానం గురించి వివరించారు. అనంతరం వాడాల్సిన సంరక్షణ ఎరువుల గురించి తెలిపారు. ఉద్యానవన శాఖ ద్వారా అమలు అవుతున్న పధకాల గురించి వివరించారు. గ్రామ వ్యవసాయ సహాయకులు డి శ్రీను, ఐసీఆర్పీ వాణి తదితరులు పాల్గొన్నారు.
