దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, తన పుట్టినరోజు సందర్భంగా మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సనత్ నగర్ లో….
సనత్ నగర్ లోని శ్రీ హనుమాన్ దేవాలయం లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం లక్ష్మీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. పూజల అనంతరం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఈ ఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో తీర్ధ ప్రసాదాలను అందజేశారు. పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే కు పలువురు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ, బి ఆర్ ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, అశోక్ యాదవ్, రాజేష్ ముదిరాజ్, భూపాల్ రెడ్డి, రాం నివాస్ బన్సాల్, పీయూష్ గుప్తా, పుష్పాలత తదితరులు ఉన్నారు.
బేగంపేట శ్రీ కట్ట మైసమ్మ లో……………………….
బేగంపేట లోని శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి ని. మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. పూజల అనంతరం అన్నపూర్ణ దేవి అలంకారంలో ని అమ్మవారి ని దర్శించుకున్నారు. పూజల అనంతరం తీర్ధ ప్రసాదాలను అందజేసిన అనంతరం వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ టి.మహేశ్వరి, ఆలయ ఈ ఓ అంబుజ, చైర్మన్ చెక్కల సుభా ష్ ముదిరాజ్ , బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, డి వి నరేందర్రావు, శేఖర్, ప్రవీణ్ రెడ్డి, కిషోర్, ఆరీఫ్, అఖిల్ తదితరులు ఉన్నారు.
త లసానికి శుభాకాంక్షలు తెలిపిన శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి ఆలయ సిబ్బంది……………
సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా బేగంపేట శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం లో పూజల అనంతరం ఆలయ సిబ్బంది తలసానిని కలిసి అభినందనలు తెలియజేసారు.


