దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బేగంపేట శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి దేవాలయం లో అమ్మవారిని సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వంగా అంబుజ,ఆలయ ఫౌండర్ చైర్మన్ చెక్కల సుభాష్ ముదిరాజ్ లు ఆలయ సంప్రదాయాల ప్రకారం కోట నీలిమని ఆలయం లోకి తోడ్కొని వెళ్లి పూజలు నిర్వహింపజేసారు.అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోట నీలిమ వెంట సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఏ బ్లాక్ అధ్యక్షులు ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేక్ గౌస్ , కాంగ్రెస్ పార్టీ యువనాయకులు అభిషేక్ అడపా,అమరం శ్రీనివాస్ రెడ్డి , సీనియర్ నాయకులు హోసి టోచర్, పవన్ , రమేష్ , సుమిత్ కుమార్ ,శీలం అనురాగ్ ,అడ్డు , మునీర్ ఖాన్ , హనీఫ్ ఖాన్ ,రాహుల్ , ప్రవీణ్ మహిళా కాంగ్రెస్ నాయకులు రమాదేవి, రాధా , చంద్రకళ మరియు పార్టీ క్యాడర్ పాల్గొన్నారు.


