దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బేగంపేట శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి దేవాలయంలో ఆదివారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాలైన కూరగాయలతో అలంకరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో వంగా అంబుజా, ఆలయ ఫౌండర్ చైర్మన్ చెక్కల సుభాష్ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. ఆలయాన్ని వివిధ రకాలైన విద్యుత్ దీపాలతో, పూలతో సుందరంగా అలంకరించారు.
