దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బేగంపేట శ్యామ్ లాల్ బిల్డింగ్ శ్రీ భక్త హనుమాన్ దేవస్థానంలో శ్రీ లలితా దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునీ పూజలు నిర్వహించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఫౌండర్ చైర్మన్ పి .ఎన్ .నటరాజ్ ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు భక్తులకు ప్రసాదాల వితరణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
