ఎన్ బి టి నగర్ లో ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ స్పందన……………

జనహిత సేవా ట్రస్ట్, అప్సా స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. బేగం పేట్ డివిజన్ లోని ఎన్ బి టి నగర్ కమ్యూనిటీ హాలు లో బుధవారం కిమ్స్ ఫౌండేషన్ రిసెర్చ్ సెంటర్ సహకారంతో జరిగిన శిబిరంలో ఆర్థోపెడిక్, జనరల్ ఫిజీషియన్, గైనకాలజి, పెడియాట్రిక్స్ విభాగాల వైద్యులు 200 మందికి బీపీ, షుగర్ లను పరీక్షించి, వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని మందులను అందజేశారు.భారత్ వికాస్ పరిషత్ ద్వారా 120 మంది మహిళలకు హిమోగ్లోబిన్ శాతం పరీక్షించి, రక్తహీనత ఉన్నవారికి ఐరన్ మాత్రలను అందజేశారు. ఈ శిబిరంలో జనహిత సేవా ట్రస్ట్ ప్రతినిధులు నర్సింహమూర్తి, వెంకట నారాయణ, అప్సా కో ఆర్డినేటర్ బస్వరాజ్, రాజేశ్వరి, శోభ, బుగ్గయ్య, శ్రీనివాస్,బి ఆర్ ఎస్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఎన్ బి టి నగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు ఎన్. శేఖర్ ముదిరాజ్, సభ్యులు నసీమ్ బాను, అరిఫ్, అఫ్షాన్ జబీన్, శోభా రాణి, విజయలక్ష్మి, శారద, హుస్సేన్ బీ, మెడికల్ క్యాంపు కో ఆర్డినేటర్ బి. నర్సింగ్ రావు పాల్గోన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *