చర్లపల్లి రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించినగౌరవ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి …..

చర్లపల్లిలో కొత్తగా అభివృద్ధి చేసిన శాటిలైట్ టెర్మినల్ స్టేషన్లో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఆదివారం తనిఖీలు నిర్వహించి నిర్మాణాలను పరిశీలించారు. ఆయన తో పాటు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ , దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, నిర్మాణ విభాగo చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సత్య, సికింద్రాబాద్‌ డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ భరతేష్‌ కుమార్‌ జైన్‌ మరియు ఇతర రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంతి కిషన్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ, చెర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ . 430 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశామని తెలియజేశారు .ఈ స్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్ లాంజ్, వెయిటింగ్ హాల్స్, స్లీపింగ్ పాడ్‌లు, కెఫెటేరియాలు, రెస్టారెంట్లు, టికెట్ బుకింగ్ కౌంటర్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, ఈవీ ఛార్జింగ్ పాయింట్లు తదితర అత్యాధునిక సౌకర్యాలు అన్ని రకాలైన సదుపాయాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. వీటితోపాటు స్టేషన్‌లో 500 చెట్లను నాటడం వర్షపునీటి గుంతల ఏర్పాటు, మురుగునీటిశుద్ధి కర్మాగారం, సోలార్ ప్యానెల్‌లు, ఎల్‌ఈడీ లైట్లు, 5,500 చెట్లకు పరిహారంగా అడవుల పెంపకం వంటి పర్యావరణ అనుకూల కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, 98శాతం చర్లపల్లి స్టేషన్‌లో పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కొత్త చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి 25 జతల రైళ్లను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం 19 లైన్ల సామర్థ్యంతో పది నూతన లైన్లను చేర్చినట్లు తెలిపారు. చర్లపల్లి స్టేషన్ జంటనగరాల్లోని ప్రజలకు ఎంతో ప్రయోజనకరమేకాకుండా సికింద్రాబాద్ , హైదరాబాద్ , కాచిగూడ స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీ తగ్గిస్తుందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, మూడవ, నాలుగు వరసల రైల్వే లైన్ లు మరియు విద్యుదీకరణ తదితరాలతో సహా వివిధ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధిని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు .
అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్‌లను పునరాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూ . 715 కోట్ల అంచనా వ్యయంతో 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని రైల్వే నెట్‌వర్క్‌లో స్వదేశీ గా అభివృద్ధి చేసిన కవచ్ రక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నామని తద్వారా రైలు కార్యకలాపాల భద్రతను పెంచుతుందని ఆయన తెలియజేశారు.
ఈ సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ప్రసంగిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో , తెలంగాణ రాష్ట్రం ఇటీవలి సంవత్సరాలలో అపూర్వమైన మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిలో సాక్షిగా నిలచిందని సౌకర్యాల కల్పనలో విమానాశ్రయమాల ప్రమాణాలతో ధీటుగా చెర్లపల్లి రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేసినందుకు ప్రధాని, మరియు రైల్వే మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా అభివృద్ధి చేసిన స్టేషన్ జంట నగరాల ప్రాంతంలోని ప్రయాణికులకు గొప్ప సౌకర్యంగా ఉంటుందని మరియు చారిత్రాత్మక కట్టడంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ స్టేషన్లో కార్యకలాపాలు ప్రారంభించినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కార్యాచరణతో ఎంతో ప్రయోజనం పొందుతారని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, కొత్తగా అభివృద్ధి చేసిన చెర్లపల్లి రైల్వే స్టేషన్‌లోని ముఖ్య విశేషాలను మీడియాకు వివరించారు. ప్రస్తుతం ఉన్న టెర్మినల్స్ వద్ద రద్దీని తగ్గించడానికి మరియు జంట నగరాల ప్రాంతంలో పెరుగుతున్న రైలు సర్వీసుల డిమాండ్‌ను తీర్చడానికి చర్లపల్లి స్టేషన్‌ను నగర ప్రాంతంలోని తూర్పు భాగంలో అభివృద్ధి చేసినట్లు ఆయన తెలియజేశారు. కొత్త స్టేషన్‌లో 9 ఎత్తు కలిగిన ప్లాట్‌ఫారమ్‌లు, 2 పాదాచారుల వంతెలను , 5 ఎస్కలేటర్లు, 5 లిఫ్టులు ఏర్పాటు చేశామని , ఈ ప్రాజెక్టుకు 2018లో అనుమతి లభించిదని మరియు పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *