వాసవిక్లబ్ సేవలు నిరుపమానం -నల్లమల్లి బదరి నారాయణ – సేవాకార్యక్రమాలతో వాసవిజిల్లా గవర్నర్ పేర్ల వేంకట సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు.

సామాజిక సేవ రంగంలో వాసవి క్లబ్స్ అత్యున్నతమైన ప్రమాణాలు పాటిస్తూ… సంస్థ ఉన్నతమైన లక్ష్యాల దిశగా క్లబ్ సభ్యులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బద్రీ నారాయణ తెలిపారు. ప్రతి సందర్భాన్ని సేవగా మలచుకుని సమాజంలో మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని అంతేకాకుండా ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వసుదైక కుటుంబమనే భావనతో నిర్విరామంగా వాసవిక్లబ్స్ సేవలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వాసవి జిల్లా 205 గవర్నర్ పేర్ల వెంకట సత్యనారాయణ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బదిలీ నారాయణ ఆధ్వర్యంలో నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. యాచకులకు అనాధలకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు మరియు పప్పు బజార్ లోని రామ మందిరానికి కుర్చీలను బహుకరించారు కార్యక్రమంలో ముందుగా అమలనాధుని వారి వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో పేర్ల వెంకట సత్యనారాయణ పేరు మీద ప్రత్యేక పూజ జరిపించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ 2024 సంవత్సరం వాసవి క్లబ్స్ అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ నిర్దేశించిన కార్యక్రమాలను, అంతర్జాతీయ కోశాధికారి శిద్దా సూర్యప్రకాశరావు స్ఫూర్తితో నిర్వహిస్తున్నామని తెలిపారు.

కార్యక్రమంలో పబ్బిశెట్టి వినోద్ కుమార్, దరిశి చంద్రశేఖర్, పబ్బిశెట్టి గోవర్ధన్, చీదెళ్ల వేంకట ప్రసాద్, భూమా శ్రీనివాసులు, క్లబ్ అధ్యక్షులు నల్లమల్లి బదరినారాయణ, కార్యదర్శి పి. నందకుమార్, కోశాధికారి జి. సునిల్ కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *