స్వర్ణాంధ్ర – 2047 నాటికి ఆర్థిక వృద్ధి రేటు పెంచేలా మండల, జిల్లాల విజన్ ప్లానింగ్ పక్కాగా అమలు జరిగేలా కృషి చేయాలి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్

స్వర్ణాంధ్ర – 2047 నాటికి ఆర్థిక వృద్ధి రేటు పెంచేలా మండల, జిల్లాల విజన్ ప్లానింగ్ పక్కాగా అమలు జరిగేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ పేర్కొన్నారు.
స్వర్ణాంధ్ర విజన్- 2047 ప్రణాళిక అమలు పై గురువారం అమరావతి సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత కార్యదర్శులతో కలిసి.. అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్షించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీరాబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ.. .. మండల , జిల్లా విజన్ ప్లానింగ్ లో పొందపర్చబడిన విధంగా ప్రతి జిల్లాలోని కీలక రంగాలపైన దృష్టి సారించి జిల్లా అభివృద్ధి ప్రణాళికను అమలుకు కృషిచేయాలన్నారు. విజన్ ఆంధ్ర 2047లో భాగంగా ఫైనల్ డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ను ఈ నెల 26 వ తేదీన రూపొందించబడుతుందని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధించడానికి లక్ష్యాలను నిర్దేశించుకుని రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, తలసరి ఆదాయం పెరిగేలా జిల్లా విజన్ ప్లానింగ్ అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ వర్చువల్ సమావేశంలో ఒంగోలు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వేంకటేశ్వర రావు, పశు సంవర్థక శాఖ జేడి డా. బేబి రాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.సురేష్ కుమార్, జిల్లా ఉద్యాన శాఖాధికారి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *