శాంతి భద్రతల పరిరక్షణకు విద్యార్థులకు అవగాహన తప్పనిసరి – పోలీస్ సేవలపై విద్యార్థులకు అవగాహన

పోలీసులు అందిస్తున్న సేవలపై విద్యార్థులకు ఎస్సై మల్లిఖార్జున రావు శుక్రవారం అవగాహన కల్పించారు. పోలీస్ అమర వీరుల వారోత్సవాల సందర్భంగా ఎబీసీ హైస్కూల్ విద్యార్థులు పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఓపేన్ హౌస్ నిర్వహించారు. ఎస్సై మల్లిఖార్జున రావు మాట్లాడుతూ… చిన నాటి నుండి పోలీసులు తమ సమాజం కోసం అందిస్తున్న సేవలపై అవగాహన కలిగి ఆపద సమయంలో, సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించుకోవాలని కోరారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఎఆర్, వైర్ లెస్ సెట్, డయల్ 100, కంప్యూటర్ రూమ్స్, తుపాకీ, ఫిస్టోల్, పోలీసులు వారి హోదాలు, విధుల గురించి విద్యార్థులకు క్షున్నంగా వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం పాటు పడుతున్న పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమర వీరులకు నివాళులు అర్పించారు. ప్రధానోపాధ్యాయుడు కె వెంకటేశ్వర రావు, సోషల్ ఉపాధ్యాయుడు కొండల రావు, వెంకట రావు , ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *