విద్యార్థులకు సులభ రీతిలో అర్థం అయ్యేలా బోధించాలని మండల విద్యాశాఖాధికారి జి . సుబ్బయ్య అన్నారు. బొద్దికూరపాడు మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాల(ఎస్సీ విఆర్)ను శక్రవారం వార్షిక తనిఖీలో బాగంగా తనిఖీ నిర్వహించారు. ఉపాధ్యాయులచే మాదిరి పాఠ్యాంశాలను బోధింప చేసారు. అన్ని రకాల రిజిస్టర్లు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. సంతృప్తి వ్యక్తం చేసారు. ఎంఈఓ -2 సుధాకర రావు తనిఖీలో పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీమన్నారాయణ, సీఆర్పీ మారుతి, పరిశీలకులు పోలం రెడ్డి సుబ్బా రెడ్డి, ఉపాధ్యాయురాలు శ్రీదేవి పాల్గొన్నారు.


