ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన….రామ్ గోపాల్ పేట కలాసిగూఢ కమ్యూనిటీ హాలు లో వైద్య శిబిరం….స్వచ్ఛంద సంస్థలు బస్తీల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం -అభినందనీయం……….రాంగోపాల్ పేట మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణా గౌడ్…..

స్వచ్ఛంద సంస్థలు బస్తీలలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాంగోపాల్ పేట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్ అన్నారు.
రామ్ గోపాల్ పేట్ డివిజన్ లోని కలాసిగూడ జిహెచ్ యంసి కమ్యూనిటి హాలులో శనివారం జరిగిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.
కిమ్స్ ఫౌండేషన్ రిసెర్చ్ సెంటర్, జనహిత సేవా ట్రస్ట్, మక్తాల ఫౌండేషన్, శివ శక్తీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో ఆర్థోపెడిక్, జనరల్ ఫిజీషియన్, గైనకాలజి, పెడియాట్రిక్స్ విభాగాల వైద్యులు 202 మందికి బీపీ, షుగర్ లను పరీక్షించి, వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని మందులను అందజేశారు.
భారత్ వికాస్ పరిషత్ ద్వారా 90 మంది మహిళలకు హిమోగ్లోబిన్ శాతం పరీక్షించి, రక్తహీనత ఉన్నవారికి మాత్రలను అందజేశారు. భాస్కరా ఐ అండ్ డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో నేత్ర, దంత పరీక్షలు నిర్వహించారు. ప్రముఖ ఫిజియోథెరపిస్టు ఎం. శ్రీనివాస్ ఆధ్వర్యంలో మోకాలు, నడుము నొప్పి ఉన్నవారికి ఎక్సర్సైజ్ లను చూపించారు.
ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణా శ్రీనివాస్ గౌడ్ నిర్వాహకులను అభినందించారు. పేద ప్రజలు ఉండే బస్తీల్లో ఉచిత వైద్య సేవలు ఎంతో అవసరమని ఆమె అన్నారు. అనంతరం మక్తాల ఫౌండేషన్ వ్యవస్థపాక అధ్యక్షులు జలందర్ గౌడ్ మట్లాడుతు ప్రతి ఒక్కరు ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలని అన్నారు చిన్న ఆరోగ్యసమస్య ఉన్నప్పుడే వైద్యులను సంప్రదించడం ద్వారా చికిత్సపోందవచ్చునని సూచించారు.
ఈ శిబిరంలో జనహిత సేవా ట్రస్ట్ ప్రతినిధులు నర్సింహమూర్తి, నంద కుమార్, శివశక్తి ఫౌండేషన్ ప్రతినిధి కల్యాణ్ కుమార్, మాజీ కార్పోరేటర్ అత్తల్లి మల్లిఖార్జున్ గౌడ్, బి.ఆర్.ఎస్. రాంగోపాల్ పేట్ డివిజన్ జనరల్ సెక్రటరీ వి.అంజనేయులు, విజయ్, మక్తాల ఫౌండేషన్ సభ్యులు సుబ్రమణ్యం, వేంకటచారి, యం. శ్రవణ్, యం.యల్. హరికుమార్, కె. వెంకటేష్, కె. వేణు, శివకుమార్ మరియు మెడికల్ క్యాంపు కో ఆర్డినేటర్ బి. నర్సింగ్ రావు పాల్గోన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *