ఎప్పటి నుంచో గోవా ట్రిప్ కు ఆటవిడుపుగా వెళ్లాలన్న జెడ్పీటీసీల కోరిక జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిలు నెరవేర్చారు. జిల్లాలోని అత్యధిక జెడ్పీటీసీలు అందరూ వైసీపీ బలపరచిన అభ్యర్థులే. అయితే జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా బూచేపల్లి వెంకాయమ్మ ఎన్నిక తర్వాత గోవా అటవిడుపుగా వెళ్లాలని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆ మేరకు కొంత తీరిక సమయం దొరకటంతో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి పిలుపు మేరకు జిల్లాలోని అత్యధిక జెడ్పీటీసీలు అందరూ గోవా టూర్ కు ఆటవిడుపుగా వెళ్లారు. కొందరు మాత్రమే వ్యక్తిగత పనులపై ఇక్కడే ఉండి పోయినట్లు సమాచారం.







