7వ తేదీ నుండి “ఉచిత మధుమేహ నియంత్రణ యోగా శిక్షణ” తరగతులు.- యోగా ప్రక్రియతో మధుమేహం, అధిక బరువు లు దూరం.- పతంజలి యోగా రాష్ట్ర అధ్యక్షులు యోగాచార్య బాలు జి

ప్రపంచంలో మొండి వ్యాధులైన మధుమేహము (షుగర్) మరియు అధిక బరువు ఈ రెండింటిని కూడా ఇంటి వద్దనే ఉంటూ అతి సులువుగా ఎవరికి వారు 90 రోజుల్లో తగ్గించుకొనే అద్భుతమైన ప్రక్రియను యోగాగురు ఋషి స్వామి రాందేవ్ బాబా హరిద్వార్ లో ప్రయోగాత్మకంగా నిరూపించి కొన్ని లక్షల మందికి సక్రియాత్మక ఫలితాలను ఇచ్చారని, దీనిపై దేశవ్యాప్త పర్యటనలు కూడా చేశారని పతంజలియోగా రాష్ట్ర అధ్యక్షులు గంధళవళ్ల బాల సుబ్రమణ్యం తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

డయాబెటిక్ ఇంటిగ్రేటెడ్ యోగ, ఉచిత షుగర్ వ్యాధి నివారణ చికిత్స క్యాంపు ప్రారంభ బ్యానర్ ఆవిష్కరణ సందర్భముగా వారు మాట్లాడుచూ… ఆ యోగా విధానం ద్వారా భారతదేశం మొత్తంలో మధుమేహం, అధికబరువు లేని ప్రజలు ఉండాలనే భావనతో ప్రతి జిల్లాలోని ప్రతి ఒక్కరికీ నేర్పించాలనే సదుద్దేశంతో రాందేవ్ బాబా శిష్యులైన దక్షిణ భారత ఇన్చార్జి స్వామి రిథ్ దేవ్ మరియు ఆంధ్రరాష్ట్ర అధ్యక్షులు యోగాచార్య బాల సుబ్రమణ్యం ద్వారా ఒంగోలు పట్టణంలో నవంబరు 7వ తేది నుండి 11వ తేది వరకు ఐదు రోజులపాటు డయాబెటిక్ ఇంటిగ్రేటెడ్ యోగ క్యాంపు, ఉచితంగా షుగర్ వ్యాధి నివారణ చికిత్స శిబిరంలో షుగర్ తగ్గించుకోవడానికి అనేక పద్దతలు నేర్పిస్తామని, ఐదు రోజులపాటు నేర్చుకున్న తర్వాత 90 రోజులు ఎలా సాధన చేయాలో కూడా నేర్పించి డయాబెటిక్ ను రివర్స్ చేసే అద్భుతమైన యోగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఉదయం 5 నుంచి 7:30 గంటల వరకు రంగారాయుడు చెరువు దగ్గరలోని ఫ్యాన్సీ గూడ్స్ మర్చంట్ అసోసియేషన్ హాల్ లో మరియు సాయంత్రం 6 నుండి 7:30 వరకు కొత్తపట్నం రోడ్డు, నల్లూరి నర్సింగ్ హోమ్, మహాలక్ష్మీ ఆలయం ఎదురుగాగల ద రిటైల్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్ లో నార్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ ఉచిత యోగ క్యాంపుకు విచ్చేసి తగిన యోగా పద్ధతులను తెలుసుకొని సాధన చేసి మధుమేహం ఊబకాయం నుండి విముక్తులు కావాలని వారు పిలుపునిచ్చారు మరిన్ని వివరాలకు 7780680121 (సోమా సుబ్బారావు), 9885125053 (దేసు వేంకయ్య) నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

బ్యానర్ ఆవిష్కరణలో కార్యనిర్వాహకులు సోమా సుబ్బారావు, దేసు వెంకయ్య, తాతా ప్రసాదు, వలివేటి సుధీర్, బోయపాటి రవి, పువ్వాడ యానాది శెట్టి, కె హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *