రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు ఉదారత తో వ్యహారించాలి – జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా

అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు ఉదారత తో వ్యహారించాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కలెక్టరేట్ లోని సమావేశ హాలులో మంగళవారం సాయంత్రం
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (DCC), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (DLRC) బ్యాంకర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలురకాల ఋణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పధకాలకు సంబంధించి నిర్దేశిత లక్ష్యాల మేరకు లబ్దిదారులకు బ్యాంకర్లు విరివిగా రుణాలు మంజూరు చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా క్రెడిట్ ప్లాన్ లక్ష్యం రూ.20,591.18 కోట్ల గా నిర్ణయించగా, 2024 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి 13,420.90 కోట్ల రుణాలు మంజూరు చేసి 65.17 శాతం ఆర్థిక ప్రగతిని సాధించడం జరిగిందన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో పంట రుణాలకు సంబంధించి ఖరీప్ లో రూ.3900.40 కోట్ల లక్ష్యానికి గాను, 2024 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి రూ.5,141.38 కోట్ల రుణాలను అందజేసి 131.81 శాతం ఆర్థిక ప్రగతిని సాధించడం జరిగిందన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో పంట రుణాలకు సంబంధించి రబీ లో రూ. 4737.16 కోట్లు లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. సీసీ ఆర్ సి కార్డ్ ఉన్న ప్రతి కౌలు రైతుకు వారి అర్హత మేరకు రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో పశు సంపదను వృద్ది చేసేలా రైతులకు పశు రుణాలను అందజేసి, రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ , బ్యాంకర్లను కోరారు. అలాగే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో 32,657 స్వయం సహాయక సంఘాలకు 1671.03 కోట్ల రూపాయాల రుణాలు మంజూరు లక్ష్యం కాగా, 2024 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి 10,880 స్వయం సహాయక సంఘాలకు 715.43 కోట్ల రూపాయాల రుణాలు మంజూరు చేసి 42.81 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు. అలాగే మెప్మా ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో 1485 స్వయం సహాయక సంఘాలకు 59.40 కోట్ల రూపాయాల రుణాలు మంజూరు లక్ష్యం కాగా, 2024 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి 1757 స్వయం సహాయక సంఘాలకు 268.77 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అందుకు సంబంధించి అర్హత పొందిన లబ్దిదారులకు పెండింగ్ లేకుండా రుణాలు అందించాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, బ్యాంకు అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పధకాలపై క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఈ అవగాహన కార్యక్రమాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వాములను చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. బ్యాంకర్ల విధిగా ఆర్థిక అక్షరాస్యత డిజిటల్ లిటరసీ కార్యక్రమాలు నిర్వహిస్తూ, నగదు రహిత లావాదేవీలు పై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు, గృహ ఆధారిత రంగాల్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వారికి రుణ సౌకర్యం బ్యాంకర్లు సహకరించాలన్నారు.

అనంతరం జిల్లా ఎస్.పి శ్రీ ఎ.ఆర్. దామోదర్ సైబర్ నేరాలపై అప్రమత్తం గా ఉండేలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బ్యాంకర్లకు అవగాహన కల్పించారు. సమాజంలో పెరుగుతున్న సైబర్‌ నేరాలపై ప్రజలతో పాటు బ్యాంకర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అపరిచితుల నుంచి ఎస్‌ఎంఎస్‌, ఈ మెయిల్‌, వాట్సప్‌ల ద్వారా వచ్చే బ్లూ కలర్‌ లింక్స్‌ను క్లిక్‌ చేస్తే, మీ మొబైల్‌లోని డేటా మొత్తం సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి పోతుందని హెచ్చరించారు. ఎవరైనా సైబర్‌ నేరాలకు గురైతే వెంటనే 1930కు కాల్‌ చేయాలన్నారు. కస్టమర్ కేర్ పేరిట మోసాలు ఎక్కువగా జరుగుచున్నవని వీటిపై ప్రజలు, బ్యాంకర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మద్య కాలంలో ఆన్ లైన నగదు లావాదేవీలు ఎక్కువగా జరుగుచున్నందున, ఎటిఎం వద్ద వినియోగదారులు సంఖ్య తక్కువగా వుండటంతో నేరాలు జరుగుచున్నదని, సంబంధిత బ్యాంకర్లు ఎటిఎం ల వద్ద గార్డు లను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ నేరాల పై అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించేలా బ్యాంకుల్లో బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్.పి, బ్యాంకర్లకు సూచించారు.

ఈ సమావేశంలో లీడ్ జిల్లా మేనేజర్ రమేష్, డిఆర్డిఎ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు వసుంధర, రవి కుమార్, వ్యవసాయ, పశుసంవర్ధక, జాయింట్ డైరెక్టర్లు ఏస్ .శ్రీనివాస రావు, డా. బేబి రాణి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర రావు, ఎపిఏంఐపి పిడి రమణ, పరిశ్రమల శాఖ జి ఎం శ్రీనివాస రావు, జౌళి శాఖ ఎడి ఉదయ కుమార్ అన్ని జిల్లా బ్యాంకు కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *