సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన డీఎస్సీ స్కినింగ్ టెస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడినట్లు జిల్లా సాంఘిక సంక్షేమాశాఖ డిడి లక్ష్మా నాయక్ తెలిపారు. సాంఘిక, గిరిజన సంక్షేమశాఖలు సంయుక్తంగా డీఎస్సీ ఉచిత కోచింగ్, వసతి నిమిత్తం దరఖాస్తులు ఆహ్వానించగా 5050 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. అందులో స్కీనింగ్ నిమిత్తం ఈనెల 10న నిర్వహించ తలపెట్టిగా ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడినట్లు చెప్పారు. తదుపరి తేదీని మరలా ప్రకటిస్తామని తెలిపారు.
