ఒంగోలులోని క్విస్ హైస్కూల్ లో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా సాగాయి. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు. విద్యార్థులు గాలిపటాలు ఎగరేసి మురిసిపోయారు. సంక్రాంతి పాటలకు విద్యార్థినీ, విద్యార్థులు డ్యాన్సులు వేసి అలరించారు. అనంతరం భోగి మంటలు వేసి సందడి చేశారు. కార్యక్రమంలో క్విస్ స్కూల్ ప్రిన్సిపల్ కమలేశ్వరి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.




