అటవీ భూములు కలిగిన రైతులకు వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా లబ్ధి చేకూరేలా కృషి చేయటం జరుగుతుందని జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాస రావు తెలిపారు. తూర్పుగంగవరం, నాగంబొట్ల పాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో బాగంగా ఎకలవ్య నగర్ ఆర్ ఎఫ్ ఆర్ – అటవీ భూములు కలిగిన రైతులతో సమావేశమైనారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ భూములు సారవంతమైనవే కాని నీటి సదుపాయం లేనందు వలన నిరుపయోగంగా మారాయని వాటిని బోర్ల ద్వారా స్పింక్లర్ల ద్వారా సేద్యం చేయటం వలన నీరు ఆదా అవుతుందని వినియోగించుకోవాలని కోరారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించాలని కోరారు. అందుకు సీఆర్పీలు, ఐసీఆర్లు రైతులను చైతన్య పరచాలని ఆదేశించారు. ఈ – పంట నమోదు సూపర్ చెక్ చేపట్టారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి ప్రసాద రావు, ప్రకృతి ఇన్చార్జి నరసింహులు, విఏఏ సుమ, ఐసీఆర్ లు రమేష్ నాగ కోటిరత్నం, అనంత లక్ష్మి, కాటం రాజు లు పాల్గొన్నారు.

