దర్శి మార్కెట్ కమిటీ( డిఎంసి)
చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దారం సుబ్బారావు సతీమణి నాగవేణి నియమిస్తున్నట్లు దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రకటించారు.
దర్శి లో డాక్టర్ లక్ష్మీ నివాసంలో నియోజకవర్గంలోని అన్ని మండల పార్టీల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో జరిగిన పార్టీ సమావేశంలో దారం నాగవేణి ని మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు సహకారం తో ఏకగ్రీవంగా …. నియమించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ
….. మన కూటమి ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలన్న సంకల్పంతోనే కీలకమైన మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని మన మహిళా నాయకురాలు నాగవేణి ని నియమించడం జరిగినట్లు ఆమె తెలిపారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, జనసేన, బిజెపి నాయకుల సంపూర్ణ సహకారంతో నాగవేణి నియామకం జరిగిందని ఆమె తెలిపారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాగవేణి నియామకం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పార్టీ నాయకుల అభిప్రాయాలను మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి వరకు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ బాబు , మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కు, మన జిల్లా అధ్యక్షులు నూక సాని బాలాజీ ద్వారా చైర్మన్ తో పాటు పార్టీలో కీలక నేతలను నెంబర్లుగా ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని డాక్టర్ లక్ష్మీ వివరించారు .
ఈ సందర్భంగా దారం సుబ్బారావు నాగవేణి దంపతులు మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన మన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కి, నారపుశెట్టి పాపారావు , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , కడియాల రమేష్ , నారపుశెట్టి పిచ్చయ్య నియోజకవర్గం లోని పార్టీ ముఖ్య నాయకులకు, జనసేన, బిజెపి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ముఖ్య మంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ధన్యవాదాలు తెలిపారు. తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు సేవ చేస్తామని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వర రావు, పిడతల నేమిలయ్య, కూరపాటి శ్రీను, బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, యాదగిరి వాసు మరియు సీనియర్ నాయకులు శేఖర్ పంతులు, మాజీ ఎం పి పి మందలపు వెంకట్రామయ్య, కాట్రాజు నాగరాజు, మాజీ జె డ్ పి టి సి నాగరాజు, చెంచయ్య, రమణారెడ్డి మ తదితరులు పాల్గొన్నారు.



