దేశంలోనే మొదటిసారిగా అనంతా రిహాబిలిటేషన్ సెంటర్ సేవలు ప్రారంభం – డాక్టర్ చంద్రశేఖర్.అనంత రిహాబిలిటేషన్ సేవలు – నగర వాసులు వినియోగించుకోవాలి. డాక్టర్ అనిరుద్ కుమార్ పురోహిత్

బేగంపేట మార్చి 26(జే ఎస్ డి ఎం న్యూస్ )
అనంత రిహాబిలిటేషన్ సెంటర్ దేశంలోనేమొట్టమొదటిసారిగా మరో అడుగు ముందుకేసి అడ్వాన్స్ త్రీడీ గేయిట్ అనాలసిస్ అండ్ త్రీడీ పోచ్చర్ ఎనాలసిస్, స్పాస్టిసిటి, అనంత స్పెషాలిటీ క్లినిక్, పీడియాట్రిక్ ఆర్తో అండ్ న్యూరో రీహబిలిటేషన్ సేవలను నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. బేగంపేట ప్రకాష్ నగర్ ఫ్లైఓవర్ పక్కన ఉన్న అనంత రిహాబిలిటేషన్ సెంటర్లో ఈ సేవలను బుధవారం సీనియర్ కన్సల్టెంట్ న్యూరో, స్పైన్ సర్జన్ డాక్టర్ అనిరుద్ కుమార్ పురోహిత్, అనంత రీహబిలిటేషన్ సెంటర్
సీఈవో డాక్టర్ చంద్రశేఖర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 75 బెడ్ రీహబిలిటేషన్ సెంటర్ గా సేవలందిస్తున్న మల్టీ స్పెషాలిటీ అనంత రిహబ్ లో పల్మనాలజీ, కార్డియాలజీ, న్యూరో, ఆర్థోపెడిక్, మస్కిలో స్కెలిటన్, క్యాన్సర్లతోపాటు గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆపరేషన్ థియేటర్ ప్రొసీజర్ రూమ్, థెరపిస్టులు, స్పీచ్ అండ్ రెస్పిరేటరీ సిబ్బంది, ఫిజియోథెరపీ, సైకాలజీ,ఆక్యుపేషనల్ రీహబ్ థెరపీ సేవలను అందిస్తూ ఎంతోమంది జీవితాల్లో తిరిగి ఆనందం తీసుకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. సెంటర్లో 24 గంటల క్రిటికల్ కేర్, వెండిలేటర్, డయాలసిస్ సేవలు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ అయిన తర్వాత కోలుకునేందుకు ప్రత్యేక సేవలు అందుబాటులో ఉన్నాయని, బ్యాలెన్స్ డైట్ అందించేందుకు న్యూట్రిషన్ల సేవలు కూడా ప్రత్యేకంగా అందిస్తున్నట్లు డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
సీనియర్ కన్సల్టెంట్ న్యూరో, స్పైన్ సర్జన్ డాక్టర్ అనిరుద్ కుమార్ పురోహిత్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో గాయాల పాలైన వారికి మానసిక ధైర్యాన్ని ఇచ్చి తిరిగి వారిని జీవితంలో నిలబడాలా చేసేందుకు అనంత రిహబ్ అందించే ఆధునిక వైద్య సేవలు ఎంతోమందికి ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. దేశంలోనే ఇలాంటి రీహబిలిటేషన్ సెంటర్లు ఎక్కడ లేవని, నిపుణులైన స్పెషలిస్టులు డాక్టర్ల పర్యవేక్షణలో ఏర్పాటుచేసిన అనంత రిహబ్ పేషెంట్లను త్వరగా కోలుకునే విధంగా చేయడంలో ఎంతో ముందుంది అన్నారు. ఇక్కడికి వచ్చే వారికి ఆనందాన్ని పంచి చిరునవ్వుతో తిరిగి పంపడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు. ఎక్కడ లేని విధంగా ఒకే చోట అన్ని రకాల రీహబిలిటేషన్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం నగరవాసులకు ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఈ సందర్భంగా కన్సల్టెంట్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ అనస్తీసియాలజీ డాక్టర్ అనూష కారుమూరి అనంత రిహబ్లో అందిస్తున్న సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సచ్చిదానందరావు, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎం. వి. ఆనంద్, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కిషోర్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ నాగచైతన్య, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఆనంద్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, ఫుట్ అండ్ యాంకిల్ స్పెషలిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ సద్వానీ, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషన్ అండ్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ శివరంజని సంతోష్, పీడియాట్రిక్ ఇంటెన్స్విస్ట్ డాక్టర్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *