హైదరాబాద్ మే 3,(జే ఎస్ డి ఎం న్యూస్) :
బీ ఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శనివారం సాయంత్రం హైదరాబాద్ లో సీజేటీవీ కార్యాలయాన్ని సందర్శించారు.ఎంపీ రవిచంద్ర తన సన్నిహితులు,సీజేటీవీ ఛైర్మన్ చందు జనార్థన్ ఆహ్వానం మేరకు ఖైరతాబాద్ లో ఉన్న టీవీ ఆఫీస్ ను సందర్శించారు.ఈ సందర్భంగా జనార్థన్,ఆయన బృందం ఎంపీ రవిచంద్రతో పాటు కార్యాలయానికి విచ్చేసిన సన్నిహితులు మరికల్ పోత సుధీర్ కుమార్, చెరుకూరి శేషగిరిరావులకు హృదయపూర్వక స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.

