డీఎస్సీ -2025 పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థులకు ఆంధ్ర ప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత ఆన్ లైన్ శిక్షణ ఇస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఎం అంజల తెలిపారు. అర్హలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈ డబ్యు ఎస్ (ఈబీసీ) అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు విద్యార్హత, టెట్ మార్కులు, కుల ధృవీకరణ, ఆదాయ, ఆదార్ జెరాక్స్ కాఫీలతో పాటు రెండు ఫోటోలను ఎపీ బీసీ స్టడీ సర్కిల్, ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదురు (పాత రిమ్స్) లో అందజేయ్యాలని కోరారు. పూర్తి వివరాలకు ఫోన్ నంబర్లు 08592-231232, 9989285530, 8985090926 లను సంప్రదించాలని వివరించారు.
ఎపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డీఎస్సీ విద్యార్థులకు ఉచిత ఆన్ లైన్ శిక్షణ
09
May