భూసార పరీక్షలతో నేలల స్వభావం తెలుసుకుని అవసరమైన మేర నేల బలానికి మందులు వాడుకుని ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటింటి మేలైన దిగుబడులు పొందవచ్చని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అన్నారు. మాధవరం రైతు సేవా కేంద్రంలో శుక్రవారం రైతులకు భూసార పత్రాలను పంపిణీ చేసారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు భూసార పరీక్షలపై అవగాహన కల్పించి ఫలితాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బంగారు నేల- బంగారు పంట పథకంలో మండలంలో 580 శాంపిల్స్ తీసినట్లు వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. ప్రతి సంవత్సరం కొన్ని క్షేత్రాలలో తీస్తున్నట్లు చెప్పారు. ఫలితాల కార్డు ఉంటే రాయితీపై సూక్ష్మ పోషకాలు అందిస్తారని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అల్లం వెంకటేశ్వర్లు, విఆర్ఓ బపాల్గొన్నా డి.ఎ భార్గవ్, విఏఏ సీహెచ్ సుధీర్ రైతులు పాల్గొన్నారు.

