బేగంపేట మే 11(జే ఎస్ డి ఎం న్యూస్ )
సికింద్రాబాద్ ,గోపాలపురం, రైల్వే స్టేషన్ రోడ్డు పరిధిలో తరచూ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న వీధి పశువులను ఆదివారం నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి జి. శంకర్ రాజు ఆధ్వర్యంలో కూకట్పల్లి గోశాలకు తరలించారు. వాహనదారుల నుంచి తరచూ అందుతున్న ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్య చేపట్టినట్లు నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి జి. శంకర్రాజు తెలియజేశారు. ఈ పశువులు వీధులలో సంచరిస్తూ పాదచారులపై తరచూ దాడులు చేయడమే కాకుండా నిత్యం ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నాయని స్థానికులు, వాహనదారుల నుంచి ఫిర్యాదులు అందడంతో వాటిని గోశాలకు తరలించినట్లు తెలియజేశారు. రెండు ఆవులను కూకట్పల్లి వద్ద ఉన్న గోశాలకు తరలించామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జుట్టు భాస్కర్ జిహెచ్ఎంసి సిబ్బంది పాల్గొన్నారు.

