సనత్ నగర్ మే 11( జే ఎస్ డి ఎం న్యూస్) :
త్యాగానికి చిరునామా అమ్మ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆదివారం సనత్ నగర్ లోని బి కే గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ లేనిదే సృష్టి లేదని, అమ్మ ప్రేమ వెలకట్టలేనిదని పేర్కొన్నారు. నేటికి అనేకమందికి తల్లి విలువ, త్యాగాలు తెలియదని, పలు చోట్ల తల్లిని అవమానిస్తున్నారని, ఇబ్బందులకు గురి చేస్తున్నారని వింటున్నామని విచారం వ్యక్తం చేశారు. నవ మాసాలు మోసి కని అనేక కష్టాలు పడి తన బిడ్డలను పెంచి పోషిస్తుందని, ఇది తల్లి గొప్పతనం అని వివరించారు. అనాదిగా తల్లికి మన జీవితంలో ప్రత్యేక స్థానం ఉన్నదని చెప్పారు. తల్లి అంటే ప్రత్యక్ష దైవం అన్నారు. తల్లికి ఏమిచ్చినా మనం ఆమె రుణం తీర్చుకోలేమని అన్నారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పార్థసారధి, సభ్యులు రామమూర్తి, కృష్ణారెడ్డి, విఠల్ రెడ్డి, సత్యనారాయణ, ప్రసాద్, సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షులు దూబే, మాజీ అధ్యక్షులు మాణిక్ రావ్ పాటిల్, జే ఎస్ టి సాయి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు అశోక్ యాదవ్,
మోడల్ కాలనీ పార్క్ లో…
అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా సనత్ నగర్ లోని మోడల్ కాలనీ పార్క్ లో నిర్వహించిన సామూహిక శ్రీమంతాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి చీరలు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, శ్రీ మాతా సేవా సమితి అధ్యక్షులు విజయ కుసుమ, పద్మ, రాధిక, కళావతి, శోభా తదితరులు పాల్గొన్నారు.


