రాంగోపాల్ పేట మే 11(జే ఎస్ డి ఎం న్యూస్) :
సరిహద్దులలో సైనికులకు విజయం, మంచి ఆరోగ్యం కావాలని కోరుతూ రాంగోపాల్పేట డివిజన్ బిజెపి నేతలు వివిధ ఆలయాలలో పూజలు నిర్వహించారు. శ్రీనరసింహస్వామి మరియు శ్రీ ఉజ్జయిని మహకాళి ఆలయం లలో రాంగోపాల్పేట డివిజన్ బిజెపి నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఓ బి సి మోర్చా తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చీర శ్రీకాంత్, బిజెపి డివిజన్ అధ్యక్షుడు సందీప్ వర్మ లు పాల్గొన్నారు. సరిహద్దుల్లో సైనికులకు విజయం మరియు మంచి ఆరోగ్యం కావాలని కోరుతూ.. భారత మాత పేరుమీది అర్చన.. మరియు ప్రియతమ ప్రధాన మంత్రి మోదీ,సైనికులకు నరసింహ స్వామి మరియు అమ్మ వారి శక్తీ అనుగ్రహం ఉండాలని.. ప్రత్యేక పూజలు జరిపించారు.
ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు ఆకుల ప్రతాప్. దయానంద్. గోపి కిషన్ జీ. శ్రీధర్. శ్రీనివాస్ యాదవ్. ధనరాజ్. ప్రవీణ్. రఘు మరియు మహిళా నాయకులు బిజెపి నాయకులు భక్తులు పాల్గొన్నారు .


