దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, పార్టీ రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్ల పూడి వేణుబాబు, కైపు రామ కోటి రెడ్డి, కెవీ పాలెం నర్పంచి శ్రీదేవి రామయ్యలు నరరావు పేటలో గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ లను ఘనంగా గజ మాలతో సన్మానం చేసారు. కేక్ ను కట్ చేయించి పంచి పెట్టారు. 110 మంది రోగులకు పండ్లు పంపిణీ చేసారు. అనంతరం దర్శి పార్టీ కార్యాలయంలో తాళ్లూరు మండల టిడిపి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని గజ మాలతో సత్కరించి మెమెంటోలు అందించారు. మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శలు శాగం కొండా రెడ్డి, మానం రమేష్ బాబు, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ పెదకాలేషా వలి (బడే), మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, రాచకొండ వెంకట రావు, కిషోర్ గుప్తా, వెలుగు సుబ్బా రావు, నవులూరి విద్యా సాగర్, తూము శివ నాగి రెడ్డి, నునుం ఆదినారాయణ, పాలం అంజి రెడ్డి, నమర, షేక్ మీరా మోహినుద్దీన్, వంగపల్లి నాగేశ్వర రావు, చాట్ల డానీ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపి మెమెంటోలు అందించారు.





