భారత ప్రభుత్వం ప్రతి సంవ
త్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీ జాతీయ స్థాయిలో అందజేసే పద్మ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఒక ప్రకటనలో తెలిపారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేస్తారన్నారు. అందులో భాగంగా కళా ,విద్య , సాహితి వైద్య , క్రీడ రంగం ల లో, సామాజికసేవ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ప్రజా సంబంధాలు, పౌర సేవలు, తయారీ, సేవా రంగం తదితర రంగాల్లో ఉత్తమ సేవలు, ప్రతిభ కనబరిచే కార్యక్రమాలు చేపట్టిన వారికి పద్మ అవార్డులు భారత ప్రభుత్వం అందించ నున్నట్లు పేర్కొన్నారు. తమ వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీఏడీఎంఏఏడబ్ల్యూఏఆర్ డీఎస్.జీఓవీ.ఐఎన్ వెబ్ సైట్ లో లో ఈనెల 31వ తేదీ లోగా నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తులు, ఇతర వివరాలను జిల్లా యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి, స్టెప్, ఒంగోలు కార్యాలయంలో ధ్రువపత్రాలతో మూడు కాపీలు సమర్పించాలన్నారు. ఇతర వివరాల కోసం కార్యాలయ పనివేళల్లో స్వయంగా కానీ లేదా ఫోన్ నంబర్ 91828 91095 ద్వారా తెలుసుకోవాలని కలెక్టర్ కోరారు.
పద్మ అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం
11
May