విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ ను గురువారం తాళ్లూరు మండలం కెవీ పాలెంకు చెందిన టిపిపి రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు అమ్మబ్రోలులో ప్రత్యేకంగా కలిసారు. పార్టీ అభివృద్ధికి తాను చేస్తున్న కృషిని వివరించారు. రాష్ట్ర స్థాయిలో నామినేటేట్ పోస్టుల భర్తీలో తనకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.


