మాధవరంలో పిచ్చి కుక్క స్వైర విహారం – పలువురుకి గాయాలు

మాధవరం గ్రామంలో గురువారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఇంటి బయట ఉన్న పిల్లలను, పెద్దలను, మహిళలపై కరిచి గాయపరచినది. సాయి అను బాలుడిని ఇష్టాను రీతిగా కరుస్తున్న సమయంలో గమనించి పెద్దలు అరుపులు వేసి, తరిమి గొట్టటంతో వెళ్లిపోయినది. అప్పటికే బాలుడి తలపై, గోంతు వద్ద తీవ్ర గాయాలైనాయి. శ్రీలక్ష్మి అనే బాలికను కూడ చేతిపై కరచి గాయపరచినది. ఇదే విధంగా గ్రామంలో పలువురికి స్వల్ప గాయాలైనాయి. గాయపడిన సాయి, శ్రీలక్ష్మిలకు తాళ్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాధమిక చికిత్స చేసి వ్యాక్సిన్ వేసారు. బాలుడు సాయి తీవ్రంగా గాయపడటంతో వైద్యుల సిఫార్స్ మేరకు ఒంగోలు రిమ్స్క తరలించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు వైద్యశాల వద్ద బాధితులపై పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి సరియైన వైద్యం అందించాలని సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *