బేగంపేట జులై 21,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ఈ రోజు సామూహిక
కుంకుమార్చనలో కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి సామూహిక కుంకుమార్చన లో పాల్గొన్నారు. ముందుగా శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి కావ్య కిషన్ రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి కావ్య కిషన్ రెడ్డితో పూజల నిర్వహింపజేసి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో ఆమె పాల్గొని పూజలు చేశారు. ఈ కుంకుమార్చన లో సుమారు 200 వందలకు పైగా మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని వివిధ రకాలైన పూలతో సుందరంగా అలంకరించారు. ఆలయానికి ఉదయం సాయంత్రం భక్తుల రద్దీ కొనసాగింది.


