బేగంపేట సెప్టెంబర్ 21,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రకాశం నగర్ డివిజన్ శ్యాం లాల్ బిల్డింగ్ లో ఎరుకల బస్తీ చౌరస్తాలో శివ భక్త భజన మండలి అధ్యక్షుడు కేంబా సారం (ఎరుకల) సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ దర్శించుకుని పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా సురేష్ ఆధ్వర్యంలో నిర్వాహకులు సర్వే తో పూజలు నిర్వహింప జేశారు.శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సర్వే మాట్లాడుతూ గణపతి ప్రజలందరి విఘ్నాలను తొలగించి చల్లగా కాపాడాలని కోరారు.అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకులు అమరం శ్రీనివాసరెడ్డి, హాజీ టోచర్ ,గౌరపల్లి రమేష్, డివిజన్ అధ్యక్షుడు దర్గా కరుణాకర్ ,బీ జే పి నాయకులు నెమలి ఆనంద్ ,విజయ్ కుమార్ తదితరులు గణనాథుని దర్శించుకుని పూజలు నిర్వహించారు.వారందరినీ సురేష్ ఘనంగా సత్కరించారు.సాయంత్రం నిర్వహించిన
అన్నదాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.ఈ సందర్భంగా శివ భక్త భజన మండలి అధ్యక్షులు ఎరుకల సురేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయకుని చెంత వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని,
ప్రతి ఏటా అన్నదానం భారీ ఎత్తున నిర్వహిస్తాం అని అన్నారు. గణపతి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలనీ కోరారు.ఇంకా
ఈ కార్యక్రమంలో శివ భక్త భజన మండలి సభ్యులు కాంగ్రెస్ నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



